పెళ్లిలో సినిమా పాటలకు కాపీరైట్ వర్తిస్తుందా.. కేంద్రం క్లారిటీ
X
ఏదైనా ఫంక్షన్ ఉందంటే పాటలు ఉండాల్సిందే. పాటలు లేకపోతే ఆ మజానే రాదు. దావత్లలో డీజే సాంగ్స్ పెట్టుకుని చిందులు వేస్తుంటే మస్త్ జోష్ ఉంటది. అయితే ఈ మధ్య సినిమా పాటలు పెట్టడానికి కాపీ రైట్ భయం పట్టుకుంది. పాటు పెడితే కాపీ రైట్ కిందకు వస్తదేమో.. రాయాల్టీ చెల్లించాలమో అనే భయాలు వెంటాడతున్నాయి. అందుకు తగ్గట్లుగానే కొందరు రాయాల్టి వసూల్ చేస్తున్నారు. తాజాగా దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
పెళ్లిళ్లు సహా పలు వేడుకల్లో పాటలను ప్లే చేయడం కాపీరైట్ ఉల్లంఘన కిందికి రాదని కేంద్రం స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే సౌండ్లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52 (1) (za) చెబుతోందని అధికారులు తెలిపారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు మతపరమైన కార్యక్రమాల కిందికే వస్తాయని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కాపీరైట్ సొసైటీలు వ్యవహరించాలని.. వాటిని కోర్టులో కూడా సవాల్ చేయలేరని చెప్పింది.
కాగా శుభకార్యాలలో మూవీ సాంగ్స్ ప్లే చేయడంపై రాయాల్టీ వసూలు చేస్తున్నారని కేంద్రానికి పలు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ దీనిపై స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించి ఆయా కాపీరైట్ సొసైటీలకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎవరైన రాయాల్టీ డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకరావాలని సూచించింది.