Home > జాతీయం > మనసు ముక్కలైంది..ఘోర రైలు ప్రమాదంపై సినీ స్టార్స్

మనసు ముక్కలైంది..ఘోర రైలు ప్రమాదంపై సినీ స్టార్స్

మనసు ముక్కలైంది..ఘోర రైలు ప్రమాదంపై సినీ స్టార్స్
X

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 280 మందికిపైగా మృతి చెందగా, దాదాపు 1000మంది గాయాలపాలయ్యారు. ఈ ప్రమాద ఘటనపై పలువురు సినీ స్టార్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తమ మనుసును కలిచి వేసిందని టాలీవుడ్‌తో పాటు సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

రైలు ప్రమాదంపై మెగాస్టార్‌ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘రైలుప్రమాద ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రక్తం అవసరం ఉంటుందని అర్థం చేసుకుంటున్నా. రక్తదానం చేసి వారి ప్రాణాలను రక్షించేందుకు సమీప ప్రాంతాల్లోని మా అభిమానులు,సేవా దృక్పథులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని చిరు ట్వీట్ చేశారు.


ఈ ప్రమాదంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘‘విషాదకర రైలు ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ విధ్వంసకర ప్రమాదంతో తీవ్ర విషాదంలో మునిగిన ప్రతి ఒక్కరి చుట్టూ నా ఆలోచనలు ఉంటాయి. ఈ కఠిన సమయంలో బాధితులకు ధైర్యం, భరోసా కల్పించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.


రైలు ప్రమాదం విని తన గుండే పగిలిందని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘‘ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం చూసి నా గుండె పగిలింది. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.

https://twitter.com/alluarjun/status/1664893089406763009

రైలు ప్రమాదం తన హృదయాన్ని కలిచివేసిందని కన్నడ స్టార్ యశ్ ట్వీట్ చేశారు. ‘‘ఒడిశా రైలు దుర్ఘటన ఎంతమంది హృదయాలను కలచివేసిందో మాటల్లో వర్ణించడం కష్టం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు.


ఒడిశా రైలు ప్రమాదం చాలా బాధాకరమని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అన్నారు. ‘‘ రైలు దుర్ఘటన అత్యంత బాధాకరం. ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి. ఈ దురదృష్టకర ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.



Updated : 3 Jun 2023 12:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top