వందేభారత్ ట్రైన్లో మూత్రం పోసినందుకు రూ. 6వేలు నష్టం
X
ఓ వ్యక్తి ఎరక్కపోయి ఇరుకున్నాడు. తెలియక చేసిన తప్పుకు నష్ట పరిహారం చెల్లించాడు. మధ్యప్రదేశ్ కు చెందిన అబ్దుల్ ఖాదీర్ కు ఈ అనుభవం ఎదురయింది. భోపాల్ నుంచి సింగ్రౌలి వెళ్లాల్సిన అబ్దుల్.. అర్జెంటుగా మూత్రం రావడంతో అదే ప్లాట్ ఫామ్ పై ఉన్న వందేభారత్ ట్రైన్ ఎక్కాడు. బాత్ రూమ్ కు వెళ్లడం.. టైం అయిపోయి వందేభారత్ ట్రైన్ కదలడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. దాంతో చేసేదేంలేక.. ముగ్గురు టీసీలను, పోలీసులను బ్రతిమిలాడాడు. అయినా ఫలితం లేకపోయింది. ట్రైన్ ఆపడం తమ వల్ల కాదని తేల్చి చెప్పడంతో చేసేదేంలేక ఆ ట్రైన్ లోనే ఉండిపోయాడు. చివరికి ఆ జర్ని అతనికి నష్టాన్ని మిగిల్చింది.
టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చేసినందుకు అబ్దుల్ కు రూ. 1020 జరిమానా విధించారు పోలీసులు. అంతేకాకుండా ఉజ్జయిన్ స్టేషన్ లో దిగి అక్కడి నుంచి బస్ ద్వారా భోపాల్ చేరుకున్నాడు. దాంతో అతనికి రూ.750 ఖర్చయింది. అంతేకాకుండా భోపాల్ నుంచి సింగ్రౌలి వెళ్లడానికి దక్షిణ్ ఎక్స్ ప్రెస్ లో రూ.4వేలు పెట్టి టికెట్ బుక్ చేసుకున్నాడు. అబ్దుల్ వందేభారత్ ట్రైన్ లో ఇరుక్కుపోవడంతో.. భోపాల్ రైల్వే స్టేషన్ లో ఉన్న అతని భార్య.. ఎనిమిదేళ్ల కొడుకు సింగ్రౌలి ట్రైన్ ఎక్కకుండా భోపాల్ స్టేషన్ లో ఉండిపోయారు. దాంతో ఆ ట్రైన్ టికెట్ డబ్బులు, ఫైన్ సహా అన్నీ కలిపి అబ్దుల్ కు రూ.6వేల నష్టం జరిగింది. దీనిపై స్పందించిన అబ్దుల్ ట్రైన్ లో ఎమర్జెన్సీ ఫెసిలిటీ లేకపోతే ఎలా.. సెక్యూరిటీ పరంగా ఎమర్జెన్సీ బటన్ ఉండాలని ఆరోపించాడు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు.. వందేభారత్ బయలుదేరే ముందు అనౌన్స్ చేస్తారని, అది వినిపిస్తున్నా ట్రైన్ లో ఉండటం అబ్దుల్ తప్పేనని అన్నారు.