Home > జాతీయం > Ambani Family: జీతం తీసుకోకుండా పనిచేస్తున్న అంబానీ వారసులు

Ambani Family: జీతం తీసుకోకుండా పనిచేస్తున్న అంబానీ వారసులు

Ambani Family: జీతం తీసుకోకుండా పనిచేస్తున్న అంబానీ వారసులు
X

ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వారసులైన ఆకాశ్ అంబానీ (Akash Ambani), ఇషా అంబానీ (Isha Ambani), అనంత్ అంబానీ (Anat Ambani)లు ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, రిల్(RIL) కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులైన వీరికి మాత్రం ఎలాంటి వేతనాలు ఉండబోవట.. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రం సంస్థ చెల్లించే ఫీజులు తీసుకుంటారట. అలాగే సంస్థ లాభాలపై కమీషన్‌నూ తీసుకుంటారట.ఈ మేరకే షేర్ హోల్డర్లకు పంపిన రిజల్యూషన్‌లో కంపెనీ వెల్లడించింది.

2014లో కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా నియమితులైన ముకేశ్‌ భార్య నీతా అంబానీ ఎలాగైతే తీసుకున్నారో అలాగే ఈ ముగ్గురూ తీసుకోనున్నారు. ఈ మేరకు ముకేశ్‌ సంతానమైన ఆకాశ్‌, ఇషా, అనంత్‌ అంబానీలను ఆర్‌ఐఎల్‌ బోర్డ్‌ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఇచ్చిన తీర్మానంలో ఆ సంస్థ పేర్కొన్నది. ఇప్పటికే 2020-21 నుంచి ముకేశ్‌ అంబానీ జీతం తీసుకోకుండా పనిచేస్తున్నారు. అంతకుముందు మాత్రం 2008-09 నుంచి 2019-20 వరకు ఏటా రూ.15 కోట్లు తీసుకుంటూ వచ్చారు. ఆర్‌ఐఎల్‌ గ్రూప్‌లోని అన్ని వ్యాపారాలు పూర్తిస్థాయిలో లాభాలను సంతరించుకునేదాకా ఇంతేనని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ముకేశ్‌ పిల్లలూ జీతాలు తీసుకోబోవడం లేదు.

"రిలయన్స్ కంపెనీ ఇటీవలే ముకేశ్ అంబానీని మరో 5 ఏళ్లపాటు కంపెనీ ఛైర్మన్​, సీఈఓగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది." అలాగే ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలను బోర్డ్​లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించింది. అయితే తాజాగా ఈ నియామకానికి షేర్​హాల్డర్ల ఆమోదం కోసం పోస్టల్​ బ్యాలెట్​లను పంపించింది. ఇటీవల ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కంపెనీ బోర్డ్​ నుంచి తప్పుకున్నారు. కానీ ఆమె కంపెనీ బోర్డ్ మీటింగ్​లకు ఆమె శాశ్వత ఆహ్వానితురాలిగా ఉంటారు. ఈ ప్రత్యేకమైన వెసులుబాటు ముకేశ్ అంబానీ సహా కంపెనీలోని మరెవ్వరికీ లేకపోవడం విశేషం.


Updated : 27 Sept 2023 11:25 AM IST
Tags:    
Next Story
Share it
Top