Home > జాతీయం > Anant Ambani : 'ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా'.. కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అంబానీ

Anant Ambani : 'ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా'.. కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అంబానీ

Anant Ambani : ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా.. కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అంబానీ
X

అపర కుబేరుడు, భారతదేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్లోని జామ్ నగర్ లో అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయి. జులైలో అంబానీ కొడుకు అనంత్- రాధిక వివాహం జరగనుండగా.. జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. ఇక ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సర్వం సిద్ధం కాగా 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏ మాత్రం తగ్గకుండా అతిథులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. విందు వినోదాలతో, స్వాగత సత్కారాలతో వారిని ఆనందింపజేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా కొడుకు అనంత్ అంబానీ మాట్లాడిన మాటలకు భావోద్వేగానికి గురయ్యారు ముఖేష్ అంబానీ. ముందుగా తన ప్రీ వెడ్డింగ్ వేడుకకు వచ్చిన అతిథులకు తన మాటలతో ఘన స్వాగతం పలికిన అనంత్.. ఆ తర్వాత తన జీవతం గురించి, ఆరోగ్య సమస్యల గురించి, భాగస్వామి రాధిక గురించి చెప్పారు. ఈ క్రమంలోనే ముకేశ్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసేందుకు తన కుటుంబం చాలా కష్టపడిందని అనంత్‌ తెలిపారు.

‘‘నన్ను సంతోషంగా ఉంచేందుకు మా అమ్మ ఎంతో చేశారు. రోజుకు 18-19 గంటలు కష్టపడ్డారు. ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌ను స్పెషల్‌గా చేసేందుకు గత రెండు నెలలుగా మా కుటుంబమంతా కేవలం 3 గంటలే నిద్రపోయింది. మీ అందరికీ తెలుసు.. నా జీవితం పూర్తిగా పూలపాన్పు కాదు. ఎన్నో ముళ్లు గుచ్చుకున్న బాధనూ అనుభవించా. చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా. కానీ, ఆ బాధను మర్చిపోయేలా నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. అనుకున్నది సాధించేలా ప్రోత్సహించారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా’’ అని చెప్పారు. కుమారుడి మాటలకు ముకేశ్‌ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌ అయ్యాయి. ఇక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్న ముఖేష్ అంబానీ దంపతులు, అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లికోసం ఎంత డబ్బు ఖర్చు పెడతారు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.

Updated : 2 March 2024 5:32 PM IST
Tags:    
Next Story
Share it
Top