Ganesh Festival : వీధి గణపయ్యకు కోటిన్నర విరాలం..ఎక్కడంటే..?
X
అత్యంత ప్రసిద్ధి చెందిన ముంబై లాల్‌బాగ్చా గణేష్‌కు భారీ విరాళాలు పోటెత్తుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే గణపయ్యకు భక్తులు కనీవిని ఎరుగని రీతిలో కానుకలు సమర్పిస్తున్నారు. నగదుతో పాటు బంగారం, వెండిని స్వామివారికి డొనేషన్లుగా అందిస్తున్నారు. కేవలం మూడే మూడు రోజుల్లో లాల్‌బాగ్చా గణపయ్యకు ఏకంగా రూ.1.59 కోట్ల నగదు విరాలంగా వచ్చింది. 879.53 గ్రామాల బంగారం, 17,534 గ్రాముల సిల్వర్ కూడా భక్తులు డొనేషన్‌గా సమర్పించారు. గణేష్ ఉత్సవాలు ప్రారంభమైన రెండో రోజే రూ.60 లక్షలకు పైగా విరాళాలు స్వామివారికి భక్తులు సమర్పించుకున్నారు.
ప్రతి సంవత్సరం ముంబైలో అత్యంత శోభాయమానంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. మరీ ముఖ్యంగా ముంబైలోని ప్రసిద్ధ గణేష్ మండపాల్లో ఒకటైనా లాల్‌బాగ్చా రాజాను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. సినీ సెలబ్రిటీల నుంచి పొలిటికల్ లీడర్లు, బిజినెస్ టైకూన్స్ ఈ మండపానికి వచ్చి గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. స్వామివారికి విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు సినీ సెలబ్రిటీలైన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఫ్యామిలీ, దీపికా పదుకొణె, సన్నీ లియోన్ ఫ్యామిలీ, అదాశర్మలతో పాటుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా తన ఫ్యామిలీతో కలిసి గణేష్‌ను దర్శించుకున్నారు. 1934లో పుత్లాబాయ్ ఛావల్‌లో తొలిసారిగా ఈ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 8 దశాబ్దాలకు పైగా ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 19న ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 29న నిమజ్జనం జరుగుతుంది.