Home > జాతీయం > ముంబైని పేల్చేస్తాం.. ఆగంతకుడి ఫోన్ తో పోలీసులు అలర్ట్

ముంబైని పేల్చేస్తాం.. ఆగంతకుడి ఫోన్ తో పోలీసులు అలర్ట్

ముంబైని పేల్చేస్తాం.. ఆగంతకుడి ఫోన్ తో పోలీసులు అలర్ట్
X

న్యూ ఇయర్ వేడుకల సమయంలో వరుస పేలుళ్లతో ముంబైలో విధ్వంసం సృష్టించనున్నట్లు ఓ ఆగంతకుడు ఫోన్ చేయడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజలంతా సెలబ్రేషన్స్ కు సిద్ధం అవుతున్న వేళ.. ఈ ఫోన్ కాల్ రావడంతో నగర వాసుల్లో ఆందోళన మొదలైంది. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ముంబై పోలీస్ కంట్రోల్ రూంకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. న్యూఇయర్ రోజున వరుస పేలుళ్లకు పాల్పడుతున్నట్లు చెప్పి కాల్ కట్ చేశాడు.

ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లు, క్రైమ్ విభాగాలను పోలీసులు అప్రమత్తం చేశారు. నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమానాస్పద పదార్థాలు, పేలుడు పదార్థాలు కానీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 31 Dec 2023 9:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top