Mumbai Terror Attack : ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి సూత్రధారి ఆజమ్ చీమా మృతి
X
26/11 ముంబై దాడుల వ్యూహకర్త ఆజమ్ చీమా మృతి చెందారు. గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. అతడి మృతితో పాక్‌లోని ఉగ్రవాదులందరూ విషాదంలో మునిగిపోయారు. కాగా ముంబై దాడుల సమయంలో చీమా లష్కర్ -ఈ-తోయిబా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నాడు. మ్యాప్ రీడింగ్‌లో చీమా సిద్దస్తుడు. ముంబై దాడులతో పాటు అనేక ఉగ్ర దాడుల్లో అతడి హస్తం ఉంది.ముంబయిలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన విషాదం వెనుక హఫీజ్ సయీద్ కీలక సూత్రధారి. ఈ దారుణంతోపాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్ సయీద్ ప్రధాన పాత్ర పోషించాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్‌ను ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ దాడిలో అప్పటి ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీసు కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్ మృతి చెందారు.
అతడు స్థాపించిన లష్కరే తొయిబాను ఐరాసతో పాటు భారత్, యూకే, అమెరికా, ఈయూ, ఆస్ట్రేలియా, రష్యా ఉగ్రసంస్థగా గుర్తించాయి. అతని తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. వీటితో పాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతో పలు మనీలాండరింగ్ కేసుల్లోనూ హఫీజ్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి.కేవలం 26/11 దాడులే కాకుండా 2006లో ముంబైలోనే 188 మంది మృతికి కారణమైన రైళ్లలో బాంబు పేలుళ్ల వెనుక ప్రధాన కుట్రదారుడు ఛీమాయేనని అప్పట్లో తేల్చారు. ఈ పేలుళ్లలో 800 మంది దాకా గాయపడ్డారు. అజమ్ ఛీమా అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలోనూ ఉన్నాడు. కాగా, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో మొత్తం 10 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు పాల్గొన్నారు.వీరు సముద్ర మార్గం ద్వారా అక్రమంగా దక్షిణ ముంబైలోకి ప్రవేశించి తాజజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌తో పాటు నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది పోలీసులతో పాటు మొత్తం 166 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఆరుగురు అమెరికన్లు ఉండటంతో ఛీమా పేరను అమెరికా తన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది.