Home > జాతీయం > Amit Shah : తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం..అమిత్ షా కామెంట్స్

Amit Shah : తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం..అమిత్ షా కామెంట్స్

Amit Shah  : తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం..అమిత్ షా కామెంట్స్
X

తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మోదీని ఓడించడమే బీఆర్‌ఎస్, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని షా అన్నారు. మజ్లిస్ చేతిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కీలు బొమ్మలు అని మూడు అవినీతి పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. బీఆర్‌ఎస్ అవినీతి చిట్టా మన దగ్గర ఉందన్నారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరుగుతున్న సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలవాలి.. ఇదే మన లక్ష్యం. దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే’ అని షా చెప్పుకొచ్చారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఆయన అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవాలి. దేశంలో ఎవరిని అడిగినా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. మేనిఫెస్టోలో హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ఈ పదేళ్లలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు చేశాం. అన్ని రంగాల్లో భారత్‌ అభివృద్ది పథంలో పయనిస్తోంది. మూడో అదిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మారుస్తాం. అవినీతిరహిత భారత్‌ నిర్మాణమే మా లక్ష్యం. మోదీ.. పదేళ్లుగా అవినీతిరహిత పాలన అందించారు.




Updated : 12 March 2024 4:08 PM IST
Tags:    
Next Story
Share it
Top