Home > జాతీయం > Ram Lalla Shila : బాలరాముని శిల తీసి కష్టాలపాలయ్యాడంటా..ఎందుకో తెలుసా!

Ram Lalla Shila : బాలరాముని శిల తీసి కష్టాలపాలయ్యాడంటా..ఎందుకో తెలుసా!

Ram Lalla Shila : బాలరాముని శిల తీసి కష్టాలపాలయ్యాడంటా..ఎందుకో తెలుసా!
X

అయోధ్య రామమందిరంలోని కొలువుదీరిన బాలరాముని చూసి భక్తులంతా పులకించిపోతున్నారు. ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తెస్తున్నారు. కానీ పొలంలో నుంచి ఆ శిలను వెలికి తీసి కష్టాలపాలయ్యానని ఆ కాంట్రాక్టర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. వెలికితీతకు సంబంధించి కొంత లాభం వచ్చినా.. అధికారులు తనకు భారీ మొత్తంలో ఫైన్ వేశారని తెలిపాడు. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా హెచ్‌డీ కోట తాలూకా బుజ్జేగౌడనపురలోని ఓ పొలంలో ఈ రాయి ఉన్నట్లు మొదటగా అధికారులు గుర్తించారు. దాన్ని బయటికి తీసేందుకు శ్రీనివాస్‌ అనే కాంట్రాక్టర్ సంబంధిత రైతుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కూలీలను పెట్టి రాతిని బయటకు తీయించాడు. ఈ డీల్ లో ఖర్చులన్నీ పోనూ తనకు రూ.25 వేల వరకు వచ్చినట్లు శ్రీనివాస్ తెలిపాడు. అయితే, శిలను బయటకు తీసేందుకు గౌర్నమెంట్ పరిమిషన్ తీసుకోలేదని, దానికి రూ.80 వేలు జరిమానా కట్టాలని అధికారులు నోటీసులను పంపించారు. రాష్ట్ర, గనులు భూగర్భ శాఖ అధికారులు జారీ చేసిన ఈ నోటీసులను చూసి భయాందోళనకు గురైనట్లు శ్రీనివాస్ చెప్పాడు. అధికారులను వెళ్లి కలవగా.. జరిమానా వెంటనే కట్టకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని వాళ్లు హెచ్చరించారు. దీంతో తన భార్య తాళిని తాకట్టు పెట్టి, ఆ డబ్బును తీసుకెళ్లి జరిమానా కట్టినట్టు వెల్లడించాడు. అప్పటికి తనకు పెండ్లి జరిగి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అయిందని శ్రీనివాస్ చెప్పారు. భవిష్యత్తులో ఆ శిలను బాల రాముడి విగ్రహం కోసం ఉపయోగిస్తారని అప్పట్లో తమకు తెలియదన్నాడు. ఇప్పుడు ఆ శిలనే బాలరాముని విగ్రహంగా మారి అయోధ్య రామ మందిరానికి చేరడం, కోట్లాది మంది భక్తుల పూజలు అందుకోవడం.. అంతా కలలా ఉందని శ్రీనివాస్ చెప్పాడు.




Updated : 28 Jan 2024 12:51 PM IST
Tags:    
Next Story
Share it
Top