Home > జాతీయం > JP Nadda : బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు

JP Nadda : బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు

JP Nadda : బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు
X

భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా పదవీకాలాన్ని ఈ ఏడాది జూన్ వరుకు పొడిగిస్తూ పార్లమెంటరీ బోర్టు ఆమోదం తెలిపింది. మరికొద్ద రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమయంలో అధ్యక్షుడి మార్పు సరికాదని బీజేపీ అధిష్ఠానం భావించినట్లు తెలుస్తొంది. ఢిల్లీలో జరిగిన జాతీయ మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవ భారత్ నిర్మాణం కోసం అహర్నిశలు పని చేద్దామని పార్టీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వంద రోజులు ఎంతో కీలకమని ఆయన అన్నారు.

గడిచిన పదేళ్లలో దేశ రూపు రేఖలు మారిపోయాయి. 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారు అని ఆయన అన్నారు. భారత్ అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిసోందని ఆయన అన్నారు. 2014లో కేవలం ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం.. ఇప్పుడు 17 రాష్ట్రాల్లో పరిపాలన సాగిస్తోందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో రెండు దశాబ్దాలకుపైగా బీజేపీ పాలిస్తోందన్నారు. బెంగాల్‌లోనూ సింగిల్ డిజిట్ నుంచి 77 సీట్లకు ఎదిగామన్నారు. దేశంలో మూడోసారి మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారేదని.. ఆ సంప్రదాయాన్ని కాదని.. ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. మనదేశ రాజకీయ స్థితిగతులను మోడీ మార్చివేశారన్నారు. గరీబ్, యువ, రైతు, మహిళా శక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ముందుకు సాగుతోందన్నారు.

Updated : 18 Feb 2024 5:12 PM IST
Tags:    
Next Story
Share it
Top