Home > జాతీయం > ఉగ్రవాదుల కాల్పుల్లో నంద్యాల జవాన్ మృతి

ఉగ్రవాదుల కాల్పుల్లో నంద్యాల జవాన్ మృతి

ఉగ్రవాదుల కాల్పుల్లో నంద్యాల జవాన్ మృతి
X

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్ళీ కాల్పులకు పాల్పడ్డారు. దీంట్లో నంద్యాలకు చెందిన సురేంద్ర అనే జవాన్ మృతి చెందారు. 2019లో ఆర్మీలో జాయిన్ అయిన సురేంద్ర అప్పటి నుంచి కాశ్మీర్ లోనే విధులు నిర్వహిస్తున్నారు.

సురేంద్ర నంద్యాల జిల్లా పాములపాడు మండలం మద్దూరు పంచాయితీకి చెందినవారు. 2019లో భారత సైన్యంలో చేరారు. జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లాలో సురేంద్ర విధులు నిర్వర్తిస్తున్నారు. నిన్న కుటుంబసభ్యులకు సురేంద్ర చనిపోయినట్లు సమాచారం అందింది. ప్రస్తుతానికి సురేంద్ర ఒక్కరి గురించే సమాచారం అందింది. మూడు రోజుల క్రితమే తమతో మాట్లాడిన కొడుకు ఇక మీదట లేడని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సెప్టెంబర్ లో వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడని వారు అంటున్నారు. సురేంద్ర పార్ధివ దేహం ఈరోజు గ్రామానికి చేరే అవకాశం ఉంది.

Updated : 2 Aug 2023 8:39 AM IST
Tags:    
Next Story
Share it
Top