Home > జాతీయం > నారాయణ మూర్తి దంపతుల మధ్య మాటల యుద్ధం.. పాపం, కరీనా కపూర్ తప్పేనట

నారాయణ మూర్తి దంపతుల మధ్య మాటల యుద్ధం.. పాపం, కరీనా కపూర్ తప్పేనట

నారాయణ మూర్తి దంపతుల మధ్య మాటల యుద్ధం.. పాపం, కరీనా కపూర్ తప్పేనట
X

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి దంపతులు.. బాలీవుడ్ నటి కరీనా కపూర్ పై మాట్లాడిన ఆసక్తి కర మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీనా తన ఫ్యాన్స్ ను అంతగా పట్టించుకోదు అని నారాయణ మూర్తి అనగా.. ఆయన సతీమణి సుధామూర్తి మాత్రం కరీనాకు మద్దతుగా నిలిచింది. ఈ విషయంలో వీరిద్దరి మధ్య కాసేపు మాటల యుద్దమే (సరదా) జరిగింది. ఇంతకీ ఈ ఇద్దరు కరీనా గురించి ఏం మాట్లాడారంటే..

నారాయణ మూర్తి దంపతులు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో నారాయణ మూర్తి కరీనా ప్రస్తావన తీసుకొచ్చారు. ‘ఓసారి లండన్ నుంచి వస్తున్నప్పుడు నేను కరీనా పక్క పక్క సీట్లలో కూర్చున్నాం. అంతలోనే ఆవిడ ఫ్యాన్ వచ్చి పలకరించారు. ఎంతమంది వచ్చినా వాళ్లెవరినీ పట్టించుకోలేదు. దాంతో వాళ్లు నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మన దగ్గరికి వచ్చి పలకరిస్తే కనీసం నిలబడి.. ఒక నిమిషమైనా మాట్లాడాలి. అది వాళ్లు మనపై పెంచుకున్న ప్రేమకు ఇచ్చే గౌరవం’ అని అన్నారు.

దానికి సరదాగా కౌంటర్ ఇచ్చిన సుదా మూర్తి ‘ఆవిడ హీరోయిన్. కోట్లమంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ విషయాలన్నీ చూసి విసిగిపోయి ఉంటుంది. అయినా ఓ కంపెనీ సాఫ్ట్ వేర్ వ్యక్తికి 10వేల మంది ఫ్యాన్స్ ఉంటారేమో అంతేకదా’ అని అనగా.. అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వుతారు. ఈ విషయంపై వీళ్లిద్దరు కాపేపు చర్చించుకుంటారు.


Updated : 25 July 2023 6:13 PM IST
Tags:    
Next Story
Share it
Top