నవీన్ పట్నాయక్ సన్నిహితుడికి కేబినెట్ హోదా
X
నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీకే పాండియన్ కు ఒడిశా ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ముఖ్యమంత్రి ప్రైవేట్ సెక్రటరీగా కొనసాగుతున్న ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఇటీవలే వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రభుత్వం పాండియన్ను 5 టీ, నబిన్ ఒడిశా స్కీం చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఒడిశా జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ 2000 బ్యాచ్కు చెందిన ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. 2002లో కలహండి జిల్లాలోని ధర్మగర్హ్ సబ్ కలెక్టర్‌గా పాండియన్ తన ఐఏఎస్ కేరీర్ ప్రారంభించారు. 2006లో మయూర్‌భంజ్ కలెక్టర్‌గా నియమితులైన ఆయన.. 2007లో గంజం కలెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే తన పనితీరుతో నవీన్ పట్నాయక్ దృష్టిని ఆకర్షించారు. 2011లో సీఎంఓలో చేరిన పాండియన్.. అప్పట్నుంచి పట్నాయక్ ప్రైవేటు సెక్రటరీగా కొనసాగుతున్నారు. 2019లో ఐదోసారి సీఎంగా పట్నాయక్ ప్రమాణం చేసిన అనంతరం వీకే పాండియన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 5టీ సెక్రటరీగా నియమితులయ్యారు.