Home > జాతీయం > గంగానది ఒడ్డున సిద్ధూ కొడుకు ఎంగేజ్మెంట్

గంగానది ఒడ్డున సిద్ధూ కొడుకు ఎంగేజ్మెంట్

గంగానది ఒడ్డున సిద్ధూ కొడుకు ఎంగేజ్మెంట్
X

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన కొడుకు కరణ్ సిద్ధూ ఎంగేజ్మెంట్ సింపుల్గా జరిగింది. పాటియాలకు చెందిన ఇనాయత్ రంధావాను కరణ్ పెళ్లి చేసుకోనున్నారు. వీరి ఎంగేజ్ మెంట్ గంగానది ఒడ్డున కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. ఈ విషయాన్ని సిద్ధూ ట్విట్టర్లో తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.





‘‘నా కొడుకు తన తల్లి కోరికను నెరవేర్చాడు. జూన్ 26 పవిత్ర దుర్గా-అష్టమి రోజున గంగామాత ఒడిలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. మాకు కాబోయే కోడలు ఇనాయత్‌ రంధావా. వీరిద్దరూ రింగ్స్ మార్చుకున్నారు’ అంటూ సిద్ధూ ట్విట్ చేశారు. ఈ ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇనాయత్ పాటియాలాకు చెందిన మనీందర్‌ రంధావా కూతురు. గతంలో ఈయన ఆర్మీలో పనిచేశారు. ప్రస్తుతం పంజాబ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.






కాగా సిద్ధూ ఇటీవలె జైలు నుంచి విడుదల అయ్యారు. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో సిద్ధూ గతేడాది జైలుకెళ్లారు. 10 నెలల జైలు శిక్ష తర్వాత ఏప్రిల్‌లోనే పాటియాలా సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. సిద్ధూ సతీమణి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అప్పటి నుంచి ఆయన కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. గత నెల ఆయన తన కుటుంబంతో కలిసి రిషికేశ్‌ను సందర్శించారు.






Updated : 27 Jun 2023 1:58 PM IST
Tags:    
Next Story
Share it
Top