Home > జాతీయం > నవోదయ స్కూళ్లలో 7,629 పోస్టుకు నోటిఫికేషన్

నవోదయ స్కూళ్లలో 7,629 పోస్టుకు నోటిఫికేషన్

నవోదయ స్కూళ్లలో 7,629 పోస్టుకు నోటిఫికేషన్
X

కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని నవోదయ పాఠశాల్లో భారీ స్థాయిలో బోధన, బోధనేతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. నవోదయ విద్యాలయ సమితి మొత్తం 7,629 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఖాళీల్లో పీజీటీ, టీజీటీ, నాన్-టీచింగ్ పోస్టులు ఉన్నాయి. జులై తొలి వారం నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. పోస్టుల బట్టి విద్యార్హత ఉంటుంది. . రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, శారీరక దృఢత్వం తదితర అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖమైన పోస్టుల వివరాలు, అర్హతలు

1. పీజీటీ (కంప్యూటర్ సైన్స్): 306 పోస్టులు, అర్హత ఎంఎస్సీ/ఎంసీఏ/ఎంటెక్(సీఎస్)తోపాటు బీఈడీ. వయసు 40 లోపు.

2. పీజీటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్): 91 పోస్టులు, అర్హత ఎంపీఈడీ, వయసు 40 లోపు.

3. పీజీటీ (ఇండియన్ లాంగ్వేజ్): 46 పోస్టులు, అర్హత బీఈడీతోపాటు సంబంధిత సబ్జెకులో వయసు 40 లోపు.

4. టీజీటీ (కంప్యూటర్ సైన్స్): 649 పోస్టులు, అర్హత బీసీఏ/బీఎస్సీ (సీఎస్)/బీటెక్(సీఎస్/ఐటీ)తోపాటు బీఈడీ, సీటెట్ అర్హత ఉండాలి, వయసు 35 లోపు

5. టీజీటీ (ఆర్ట్): 649 పోస్టులు, అర్హత డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్)తోపాటు బీఈడీ, వయసు 35 లోపు

6. టీజీటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్): 1244 పోస్టులు అర్హత బీపీఈడీ, వయసు 35 లోపు.

7. టీజీటీ (మ్యూజిక్): 649 పోస్టులు, అర్హత డిగ్రీ (మ్యూజిక్), వయసు 35 లోపు.

8. స్టాఫ్ నర్స్: 649 పోస్టులు, అర్హత బీఎస్సీ (నర్సింగ్), వయసు 35 లోపు

9. క్యాటరింగ్ సూపర్‌వైజర్: 637 పోస్టులు, అర్హత డిగ్రీ (హోటల్ మేనేజ్‌మెంట్) లేదా ఐటీఐ, 35 లోపు ఉండాలి.

10. ఆఫీస్ సూపరింటెండెంట్ 594 పోస్టులు

11. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 598 పోస్టులు, ఐటీఐ, 40 లోపు.

12. మెస్ హెల్పర్: 1297 పోస్టులు, పదో తరగతి, 35 ఏళ్లలోపు.

13. స్టెనోగ్రాఫర్: 49 పోస్టులు, ఇటర్, స్టెనోగ్రఫీ, 18 - 27 ఏళ్ల లోపు





Updated : 24 Jun 2023 6:23 PM IST
Tags:    
Next Story
Share it
Top