Home > జాతీయం > టెక్ట్స్ బుక్స్లో ఇండియా పదం తొలగించండి.. ఎన్సీఈఆర్టీకి కమిటీ సూచన

టెక్ట్స్ బుక్స్లో ఇండియా పదం తొలగించండి.. ఎన్సీఈఆర్టీకి కమిటీ సూచన

టెక్ట్స్ బుక్స్లో ఇండియా పదం తొలగించండి.. ఎన్సీఈఆర్టీకి కమిటీ సూచన
X

టెక్స్ట్ బుక్స్లో ఇండియా బదులు భారత్ అనే పదాన్ని వాడాలని ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదించింది. 5 నుంచి 12 వ తరగతి వరకు సోషల్ సైన్సెస్ పాఠ్యపుస్తకాల్లో ఇండియా బదులు భారత్ పేరు వాడాలని ఎన్సీఈఆర్టీకి సూచించినట్లు కమిటీ ఛైర్పర్సన్ ఇసాక్ ప్రకటించింది. పాఠ్యపుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులుగా క్లాసికల్ హిస్టరీని చేర్చేలా సిలబస్ లో మార్పు చేయాలని సూచించినట్లు చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనలపై ఎన్సీఈఆర్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇసాక్ స్పష్టం చేశారు.

ఇండియా పదాన్ని తొలగించడంతో పాటు హిందువులు సాధించిన విజయాలను సైతం టెక్స్ట్ బుక్స్లో చేర్చాలని కమిటీ సూచించింది. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాల్లో హిందూ రాజులు, చక్రవర్తుల ఓటమి గురించి మాత్రమే ప్రస్తావన ఉందని, మొఘలులు, సుల్తానుపై సాధించిన విజయాల గురించి ప్రస్తావన లేదని కమిటీ గుర్తించింది. అందుకే కొత్త టెక్స్ట్ బుక్స్ లో ఈ విజయాలను చేర్చాలని ప్రతిపాదించింది.

కొత్త జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలను రివైజ్ చేస్తోంది. ఈ క్రమంలో ఎన్సీఈఆర్టీ 19 మంది సభ్యులతో నేషనల్ సిలబస్, టీచింగ్ లర్నింగ్ మెటీయల్ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు ఇండియా పదం తొలగింపుతో పాటు అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాల్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టంను చేర్చాలని ప్రతిపాదించింది. కమిటీ సూచనలపై ఎన్సీఈఆర్టీ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.




Updated : 25 Oct 2023 5:19 PM IST
Tags:    
Next Story
Share it
Top