శరద్ పవార్కు షాక్ .. అధికార కూటమితో జతకట్టిన అజిత్ పవార్
X
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్.. అధికార శివసేన(షిండే) - బీజేపీ కూటమితో జత కట్టారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. తన వర్గానికి చెందిన మరికొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 53మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 43మంది మద్ధతు అజిత్ పవార్కు ఉన్నట్లు సమాచారం.
ప్రతిపక్ష నేత పదవి నుంచి వైదొలుగుతానని పవార్ ఇటీవలె వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన అధికార పక్షానికి జైకొట్టడం గమానర్హం. ఈ ప్రమాణస్వీకారంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. గత కొంతకాలంగా ఎన్సీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతోనే శరద్ పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు ఎగరవేసినట్టుగా తెలుస్తోంది