మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అజిత్ పవార్..?
X
మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్సీపీని చీల్చి బీజేపీ, షిండే వర్గంతో జతకట్టిన అజిత్ పవార్ త్వరలోనే సీఎం పగ్గాలు చేపట్టనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ చేసిన ట్వీట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. అజిత్ పవార్ త్వరలో ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన మద్దతుదారుల శుభాకాంక్షలు చెబుతూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసిన వీడియోను అమోల్ పోస్ట్ చేశాుర. కొన్ని హోర్డింగ్‌ల్లో అజిత్ పవార్‌ను మహారాష్ట్రకు కాబోయే సీఎంగా అభివర్ణించారు. ఈ వీడియోను ఎమ్మెల్యే ‘నేను అజిత్ అనంతరావు పవార్ మహారాష్ట్ర సీఎంగా త్వరలో ప్రమాణం చేబోతున్నాను’ అనే క్యాప్షన్ తో ట్వీట్ చేశారు.
मी अजित अनंतराव पवार महाराष्ट्राचा मुख्यमंत्री म्हणून शपथ घेतो की......! लवकरच #अजितपर्व pic.twitter.com/12jZ8BMPRi
— आ. अमोल रामकृष्ण मिटकरी (@amolmitkari22) July 21, 2023
అధికార మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ పెద్దలను కలిశారు అయితే, ప్రధానితో భేటీ అనంతరం షిండే రాయఘడ ఘటన, వర్షాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై చర్చించినట్లు చెప్పారు. పైకి అలా చెబుతున్నా సీఎం మార్పుపై సైతం చర్చ జరిగినట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జులై 2న మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అజిత్ పవార్ సహా 9 మంది ఎన్సీపీ నేతలు షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టగా.. ఎమ్మెల్యేలకు కీలకమైన మంత్రి పదవులు దక్కాయి. అయితే ఈ పరిణామాలపై సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.