Home > జాతీయం > దేశంలో మంగళవారం మహాయుద్ధం.. 30 ఎన్డీఏ, 24 విపక్షాల హాట్‌హాట్ భేటీలు

దేశంలో మంగళవారం మహాయుద్ధం.. 30 ఎన్డీఏ, 24 విపక్షాల హాట్‌హాట్ భేటీలు

దేశంలో మంగళవారం మహాయుద్ధం.. 30 ఎన్డీఏ, 24 విపక్షాల హాట్‌హాట్ భేటీలు
X

దేశ రాజకీయాల్లో మంగళవారం మహాయుద్ధానికి లాంఛనంగా తెరలేవనుంది. ఈ నెల 18న అధికార, విపక్ష పార్టీలు వేటికవి ఒకే వేదికపైకి చేరి మంతనాలు జరపనున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులు, వ్యూహాలు ఖరారు చేసుకోనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి ఢిల్లీలోని అశోకా హోటల్లో భేటీ కానుంది. బీజేపీ అధినేత జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీల అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి 30 పార్టీలు హాజరు కానున్నాయి. ఏపీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరు కానున్నారు. టీడీపీకి కూడా ఆహ్వానం వచ్చినల్లు వార్తలు వచ్చినా నిజం కాదని తేలింది.



మరోపక్క.. కాంగ్రెస్, జేడీయూ, తృణమూల్ తదితర విపక్షాల సారథ్యంలో 24 పార్టీలు బెంగూళూరులో భేటీ కానున్నాయి. సోమవారం తొలి విడత చర్చలు, మంగళవారం తుదివిడత చర్చలు జరపనున్నాయి. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చట్టసభలో అనుసరించాల్సి వ్యూహాల గురించి చర్చించేందుకు రెండు శిబిరాలు భేటీ అయ్యాయి. అయితే అసలు ఉద్దేశం, 2024 ఎన్నికల్లో కలసి వచ్చే మిత్రులెవరో తేల్చుకుని, ఆనక పొత్తులు, సీట్లు పంపకాలపై ఓ మాట అనుకోవడానికే భేటీలు నిర్వహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత నెల బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పట్నాలో 17 విపక్షాలతో సమావేశం నిర్వహించారు. బీజేపీని ఎదుర్కోవడానికి ఏకతాటిపై వస్తామన్నారు. బీజేపీ నేతలు ఆ సమావేశాన్ని ఫోటో సెషన్ అని కొట్టిపడేశారు. ఇప్పుడు వారే మళ్లీ ఎన్డీఏని సమావేశపరడం గమనార్హం. ఎన్డీఏ నుంచి వెళ్లిపోయిన పార్టీలను తిరిగి చేర్చుకోవడానికి భేటీలో చర్చలు జరపనున్నారు. లోక్ జనశక్తి, హిందుస్తానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా, వికాస్ శీల్ ఇన్సాన, సహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చిన్నాచితకా పార్టీలో మంతనాలు సాగనున్నాయి.

ఎన్డీఏ భేటీకి హాజరయ్యే పార్టీల్లో కొన్ని..

బీజేపీ, అన్నాడీఎంకే, శివసే(ఏక్‌నాథ్ షిండే), ఎన్పీపీ, జేజేపీ, టీఎంసీ, బీబీపీ(బోడో), ఎంజీపీ(గోవా), ఏజీపీ(అస్సాం), ఎల్జేపీ, శిరోమణి, పీఎంకే(తమిళనాడు), ఎంఎన్ఎఫ్(మిజోరం), టీఎంసీ( తమిళ మానిల కాంగ్రెస్), ఆర్పీఐ, ఎన్సీపీ (అజిత్ పవార్)

విపక్షా భేటీకి హాజరు కానున్న పార్టీల్లో కొన్ని

కాంగ్రెస్, జేడీయూ, ఆప్, డీఎంకే, తృణమూల్, ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, సమాజ్ వాదీ, వాపక్షలు, పీడీపీ, జేఎంఎం, శివసేన(ఉద్ధవ్)


Updated : 16 July 2023 8:38 PM IST
Tags:    
Next Story
Share it
Top