Home > జాతీయం > Rajasthan: అంగన్వాడీ ఉద్యోగాలంటూ.. 20 మంది మహిళలపై దారుణాలు

Rajasthan: అంగన్వాడీ ఉద్యోగాలంటూ.. 20 మంది మహిళలపై దారుణాలు

Rajasthan: అంగన్వాడీ ఉద్యోగాలంటూ.. 20 మంది మహిళలపై దారుణాలు
X

అంగన్వాడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 20 మంది మహిళలపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సిరోహికి చెందిన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మహేంద్రా మేవాడా, మాజీ మున్సిపల్‌ కౌన్సిల్‌ కమిషనర్‌ మహేంద్ర చౌదరి.. పలు ప్రాంతాలకు చెందిన మహిళలపై దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. పాలీ జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు మొదట ఆ ఫిర్యాదును తప్పుడు ఫిర్యాదుగా పరిగణించి పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది బాధితురాలు. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధిత మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. అంగన్ వాడీలో ఉద్యోగాలిస్తామని చెప్పడంతో.. తనతోపాటు మరికొంతమంది మహిళలు సిరోహి వెళ్లారు. అక్కడ మహేంద్రా మేవాడా, మహేంద్ర చౌదరి లు తమకు వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. ఆ వసతి గృహంలో వడ్డించిన భోజనంలో మత్తుమందు కలిపి, తిన్న తర్వాత మత్తులో జారుకున్నాక వారిపై సామూహిక అత్యాచారం చేశారు. అలా 20 మందిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ అకృత్యాలకు సంబంధించిన ఘటనలను వీడియో కూడా తీశారు. స్పృహలోకి వచ్చిన తరువాత ఫోన్ లలో ఉన్న వీడియోలను చూపించి, విషయం బయటకు చెప్పకూడదంటూ బెదిరించారు. వీడియోలను ఇంటర్నెట్ లో పెడతామంటూ రూ.లక్షలు డిమాండ్‌ చేశారు.

జరిగిన అఘాయిత్యాన్ని తట్టుకోలేక బాధిత మహిళతోపాటు మరికొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని , నిందితులపై ఎఫ్‌ఆర్‌ఐ చేయకుండా వదిలేశారు. చివరకు తమకు న్యాయం చేయాలని 8 మంది బాధిత మహిళలంతా రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




Updated : 11 Feb 2024 8:43 PM IST
Tags:    
Next Story
Share it
Top