Home > జాతీయం > 399 రూ.లకే 10లక్షల తపాలశాఖ కొత్త బీమా పథకం

399 రూ.లకే 10లక్షల తపాలశాఖ కొత్త బీమా పథకం

399 రూ.లకే 10లక్షల తపాలశాఖ కొత్త బీమా పథకం
X

తపాలాశాఖ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. 399 రూ.కే గ్రూప్ యాక్సిడెంట్ కార్డ్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది.

టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ సంస్థతో కలిసి పోస్టాఫీస్ శాఖ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఓ విన్నూత్న పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. గ్రూప్ యాక్సిడెంట్ కార్డ్ పాలసీ ద్వారా ఎలాంటి ప్రమాదం జరిగినా బీమా తీసుకున్నప్పటి నుంచి ఏడాది పాటూ 10 లక్షల కవరేజీ వర్తించేలా కొత్త పథకాన్ని అందిస్తోంది. ఇది 399 రూ.లకే లభిస్తోంది. ఆల్రెడీ ఈ పథకం అమలులో ఉందని తెలిపింది.





ఈ పాలసీ పొందాలంటే ముందుగా పోస్ట్ బ్యాంకులో ఖాతా ఉండాలి. ఒకవేళ లేకపోతే 200 రూ. లతో ఖాతాను తెరుచుకోవచ్చును. తర్వాత బీమా పాలసీ నగదు 399రూ. లను చెల్లించాలి. ఇది చెల్లించాక ప్రమాదం సంభవిస్తే బీమా వర్తిస్తుంది. అయితే మళ్ళీ ఇందులో దీర్ఘకాలిక పక్షవాతం ఉన్నవాళ్ళకు మాత్రం ఈ బీమా వర్తించదని తెలిపింది. పాలసీ కోసం నగదు చెల్లించిన అర్ధరాత్రి 12 గంటల నుంచి బీమా రక్షణ లభిస్తుంది. పాలసీ దారులకు బాండ్ ను కూడా ఇస్తారు.





యాక్సిడెంటల్ డెల్ అయితే బీమీ పథకంలో 10 లక్షలు వస్తాయి. శాశ్వత వైకల్యం కలిగిన వారికి , పాక్షిక వైకల్యానికి, ప్రమాదవశాత్తు అంగచ్చేదం జరిగితే, పక్షవాతం సంభవిస్తే 10 లక్షలు వర్తిస్తాయి. అదికాకుండా వైద్య ఖర్చులకు ఐపిడి 60 వేల రూ. వరకు లభిస్తుంది. క్లైమ్ లో ఏవి తక్కువైతే అది వర్తిస్తుంది. చిన్న గాయాలకు 30 వేల రూ. వస్తాయి. విద్య ప్రయోజనం కోసం 10శాతం ఇస్తారు. ఆసుపత్రిలో పదిరోజులు ఉంటే రోజుకు వెయ్య రూపాయల చొప్పున అందిస్తారు. కుటుంబ రవాణా ప్రయోజనాల కోసం 25వేలు, అంత్యక్రియల కోసం 5 వేల రూపాలయను ఏర్పాటు చేస్తారు. గ్రామీన ప్రాంతాల్లో పేద, బడుగు, బలహాన వర్గాల కోసం ఈ పథకాన్ని రూపొందించామని తపాలాశాఖ తెలిపింది. మరిన్ని వివరాల కోసం పోస్టాఫీసులను సంప్రదించవచ్చని చెప్పింది. క్లెయిమ్ కోసం 18002667780, 1800229966 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.


Updated : 7 July 2023 5:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top