Home > జాతీయం > భారత్, ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీల మధ్య కొత్త ఒప్పందాలు: ప్రధాని మోదీ

భారత్, ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీల మధ్య కొత్త ఒప్పందాలు: ప్రధాని మోదీ

భారత్, ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీల మధ్య కొత్త ఒప్పందాలు: ప్రధాని మోదీ
X

ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆ దేశ ప్రధాని ఎలిజబెత్ బార్న్ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ - ఫ్రాన్స్‌ల పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించేలా కృషి చేస్తామని మోదీ చెప్పారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన వేళ మోదీ ఈ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఇరుదేశాల ప్రధానుల మధ్య జరిగిన చర్చల్లో భారీ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మోదీ.. ‘ఫ్రాన్స్ లో చదివే భారతీ విద్యార్థులకు దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేసే నిర్ణయం దీసుకున్నాం. దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇక్కడ క్యాంపస్లు ఏర్పాటు చేయాలని ఫ్రెంచ్ వర్సిటీలను ఆహ్వానించాం. ఈసారి పారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు భారత అథ్లెట్లు ఉత్సాహంగా ఉన్నారు. అంతరిక్ష రంగంలో ఇరు దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. దానికి సంబంధించి 2 దేశాల స్పేస్ ఏజెన్సీల మధ్య కొత్త ఒప్పందాలు జరిగాయ’ని తెలిపారు.




Updated : 15 July 2023 8:13 AM IST
Tags:    
Next Story
Share it
Top