రైళ్లు, విమానరంగంలో కొత్త మార్పులు : Nirmala Sitharaman
X
బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైళ్లు, విమానరంగాల గురించి కీలక ప్రకటన చేశారు. రైల్వేల బలోపేతానికి కొన్ని కీలక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి గతిశక్తి పథకం కింద 3 కారిడార్లను నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ రవాణా కోసం మూడు ప్రత్యేక రైల్వే కారిడార్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు. వందే భారత్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇతర నగరాలతో మెట్రో రైలును అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు.
వచ్చే పదేళ్లలో విమానయాన రంగంలో నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నామన్నారు. కొత్త విమానాశ్రయాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. పదేళ్ల కాలంలో విమానాశ్రయాల సంఖ్యను 149కి పెంచుతామన్నారు. అలాగే ఉడాన్ పథకం కింద 517 కొత్త మార్గాలను అనుసంధానించనున్నట్లు తెలిపారు. టైర్-2, టైర్3 నగరాల్లో ఇప్పటికే ఉడాన్ పథకం విజయవంతమైందన్నారు. రానున్న రోజుల్లో వందేభారత్ తరహాలోనే 40 వేల కొత్త బోగీలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు వెల్లడించారు.