Home > జాతీయం > GST Rule : మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు..వారికి అలర్ట్

GST Rule : మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు..వారికి అలర్ట్

GST Rule : మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు..వారికి అలర్ట్
X

ప్రతినెెలా ఒకటో తేది నుంచి కొన్ని నిబంధనలు మారుతూ ఉంటాయి. నేటి ఫిబ్రవరి నెల ముగుస్తోంది. దీంతో రేపటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. మరి మారే ఆ రూల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్ చేయడానికి ఫిబ్రవరి 29న ఆఖరు తేదిగా నిర్ణయించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ మేరకు ప్రకటన చేసింది. ఒక వేళ మార్చి 1వ తేది లోపు మీరు మీ ఫాస్టాగ్ కేవైసీని పూర్తిచేయకుంటే ఆ తర్వత డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి అకౌంట్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నారు.

ఇకపోతే రేపటి నుంచి సోషల్ మీడియాలో కొత్త నిబంధనలు రానున్నాయి. తాజాగా కేంద్రం ఐటీ రూల్స్‌ను కూడా మార్పు చేసింది. ట్విట్టర్ (ఎక్స్), ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లు ఈ రూల్స్‌ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మార్చి 1వ తేది నుంచి సోషల్ మీడియాలో తప్పుడు వాస్తవాలతో కూడిన కంటెంట్‌ను ప్రసారం చేస్తే దానికి జరిమానా విధించనున్నారు. సోషల్ మీడియాను సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జీఎస్టీ కొత్త రూల్ ప్రకారంగా రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఈ-చలాన్ ఇవ్వకుండా ఈ-వే బిల్లులను జారీ చేయకూడదు. అన్ని రకాల లావాదేవీలపై ఆ నిబంధన వర్తిస్తుంది. జీఎస్టీ పన్ను విధానం చూస్తే రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పంపుతున్నప్పుడు ఈ-వే బిల్లును తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది.

దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త రూల్ తెచ్చింది. మార్చి 15వ తేది నుంచి ఆ నిబంధన అమలులోకి రానుంది. క్రెడిట్ కార్డు మినిమమ్ డే బిల్ క్యాలిక్యులేషన్ విధానంలో కొన్ని మార్పులు తెచ్చింది. ఆ రూల్స్ ఏంటో మార్చి మొదటివారంలోనే తమ వినియోగదారులకు ఎస్బీఐ తెలియజేయనుంది.




Updated : 29 Feb 2024 2:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top