Home > జాతీయం > అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గమనిక

అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గమనిక

అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గమనిక
X

అగ్ర రాజ్యం అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని చాలా మంది విద్యార్థులు కల కంటుంటారు. చదువు పూర్తి కాగానే అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడి అమెరికాలో శాశ్వత నివాసం పొందాలని ఆశపడుతుంటారు. ఈ క్రమంలోనే అందుకు తగ్గట్టుగా అన్ని రకాలుగా సిద్దమవుతారు. ఇలా భారత్ నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళుతుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థి వీసాల కోసం అమెరికా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఎమ్, ఎఫ్, జే కేటగిరీ వీసాల కోసం దరఖాస్తు పలు మార్పులు తీసుకువచ్చింది. ఈ క్రమంలో కొత్త నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు, వాటిని గమనించాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.

కొత్త నిబంధనలు ఏంటంటే..

US ఎంబసీ ప్రకారం.. F, M, J విద్యార్థి కేటగిరీల క్రింద దరఖాస్తు చేసుకునే వారందరూ ప్రొఫైల్‌ను రూపొందించేటప్పుడు, వారి వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసేటప్పుడు వారి స్వంత పాస్‌పోర్ట్ సమాచారాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. తప్పుడు సమాచారం ఇస్తే వారి దరఖాస్తును తిరస్కరిస్తారు. వారి అపాయింట్ మెంట్ రద్దవడమే కాదు, వీసా ఫీజులు కూడా నష్టపోతారు.

తప్పుడు పాస్ పోర్టు నెంబరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు... తిరిగి సరైన పాస్ పోర్టు నెంబరుతో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడంతో పాటు, మళ్లీ అపాయింట్ మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి. అంతేకాదు, మళ్లీ కొత్తగా వీసా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ పాస్ పోర్టు పోయినా, చోరీకి గురైనా కొత్త పాస్ పోర్టు తీసుకున్నవారు, పాస్ పోర్టును రెన్యువల్ చేయించుకున్నవారు పాత పాస్ పోర్టుకు సంబంధించిన ఫొటోకాపీని, ఇతర పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. అప్పుడే వారి అపాయింట్ మెంట్ ప్రక్రియకు అనుమతి లభిస్తుంది.

ఎమ్, ఎఫ్ కేటగిరీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు స్టూడెంట్ అండ్ ఎక్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ధ్రువీకరించిన స్కూల్, లేదా ప్రోగ్రామ్ లో పేర్లు నమోదు చేసుకోవడం తప్పనిసరి. జే కేటగిరీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్ షిప్ తప్పనిసరి.

వీసా అంశంలో మోసాలు, అపాయింట్ మెంట్ వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని కట్టడి చేసేందుకే నిబంధనలు మార్చినట్టు వెల్లడించింది.

Updated : 28 Nov 2023 8:31 AM IST
Tags:    
Next Story
Share it
Top