Home > జాతీయం > NIA Raids: ఖలిస్థానీ సానుభూతిపరులపై ఎన్ఐఏ ఉక్కుపాదం

NIA Raids: ఖలిస్థానీ సానుభూతిపరులపై ఎన్ఐఏ ఉక్కుపాదం

NIA Raids: ఖలిస్థానీ సానుభూతిపరులపై ఎన్ఐఏ ఉక్కుపాదం
X

"ఖలిస్థానీ సానుభూతిపరులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉక్కుపాదం మోపుతోంది". ఖలిస్థాన్ సానుభూతిపరులు - గ్యాంగ్స్టర్ల సంబంధాలను కత్తిరించే పనిలో పడింది. (NIA Raids) ఇందులో భాగంగా 6 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో 51 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. లారెన్స్ బిష్ణోయ్, బంబీనా, అర్షదీప్ దల్లా గ్యాంగులతో సంబంధమున్న వారందరి ఇండ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఖలిస్థానీలు భారత్‌లో నియమించుకొన్న వ్యక్తులకు గ్యాంగ్‌స్టర్ల నుంచి హవాల మార్గంలో డబ్బులు వస్తున్నాయని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. ఆ నిధులతోనే వారు డ్రగ్స్‌, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారని అంటున్నాయి. వీరందరికీ పాక్‌ ఐఎస్‌ఐ సహకారం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే యూఏపీఏ కింద అరెస్టు చేసిన వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పంజాబ్‌లో 30 చోట్ల, రాజస్థాన్‌లో 13, హర్యానాలో 4, ఉత్తరాఖండ్‌లో 2, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో చోట తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్‌ నుంచి పారిపోయి యూకే, కెనడా, దుబాయ్‌, పాకిస్థాన్‌ తదితర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న 19 మంది ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల లిస్టును ఎన్ఐఏ విడుదల చేసింది. హర్విందర్‌ సింగ్‌ సంధు, లక్బిర్‌ సింగ్‌ సంధు పేరిట రూ.10 లక్షలు చొప్పున రివార్డును కూడా ప్రకటించింది.

Updated : 27 Sept 2023 12:34 PM IST
Tags:    
Next Story
Share it
Top