కరీంనగర్‌లో NIA అధికారుల సోదాలు.. అతడి కోసం గాలింపు.
X
రాష్ట్రంలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తనిఖీలు నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గురువారంనాడు ఉదయం ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. పీఎఫ్ఐ కదలికల నేపథ్యంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. కరీంనగర్ హుస్సేన్‌పురలో ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. హుస్సేన్ పురలో పీఎఫ్ఐ కదలికలపై అనుమానాలతో అనుమానంతో ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడ ఎన్ఐఏ అధికారులు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం.. ఏఆర్ పోలీసుల బందోబస్తు మధ్య సోదాలు చేపట్టింది. కరీంనగర్ హుస్సేనీపురకు చెందిన తబరేజ్ అనే వ్యక్తికి గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎన్‌ఐఏ అధికారుల బృందం అతడి కుటుంబసభ్యులను విచారించింది. తెల్లవారుజామున 4 గంటలకే చేరుకున్న అధికారులు.. దాదాపు 3 గంటల పాటు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తబరేజ్ ఎనిమిది నెలల క్రితమే ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. తబరేజ్ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం ప్రత్యేకంగా కరీంనగర్‌కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనిఖీలు కొనసాగుతున్న ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
2022 సెప్టెంబర్ 18న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 40 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో నలుగురిని అరెస్ట్ చేశారు.తెలంగాణలోని నిజామాబాద్ లో పీఎఫ్ఐ కదలికలను స్థానిక పోలీసులు తొలుత గుర్తించారు. నిజామాబాద్ లో వ్యాయామ శిక్షణ పేరుతో నిర్వహిస్తున్న ట్రైనర్ ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో పీఎఫ్ఐ కార్యకలాపాలు వెలుగు చూశాయి. దీంతో 2022 జూలై 4న నలుగురిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ సహదుల్లా, మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబీన్, అబ్దుల్ ఖదీర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడ పీఎఫ్ఐ కార్యకలాపాలు వెలుగు చూశాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు చోట్ల పలువురిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో పీఎఫ్ఐ కేసును స్థానిక పోలీసులు ఎన్ఐఏకి అప్పగించారు.