Home > జాతీయం > నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 450 ఉద్యోగాలకు NIACL నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 450 ఉద్యోగాలకు NIACL నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 450 ఉద్యోగాలకు NIACL నోటిఫికేషన్
X

నిరుద్యోగులకు NIACL గుడ్ న్యూస్ తెలిపింది. 450 ఉద్యోగాలకు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉన్నత చదువులు చదివిన వారికి ఇది మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్తో జనరలిస్ట్స్‌, ఐటీ, హెల్త్‌, లీగల్, అకౌంట్స్‌, ఆటోమొబైల్, రిస్క్ ఇంజినీర్ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అగస్ట్ 21లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు..

రిస్క్ ఇంజనీర్ - 36, జనరలిస్ట్స్‌ -120, లీగల్ -70, ఐటీ - 23, హెల్త్‌ - 75, అకౌంట్స్‌ - 30, ఆటోమొబైల్ ఇంజినీర్ - 96 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఆయా పోస్టులను బట్టి విద్యార్హతలు ఉండనున్నాయి. 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అప్లికేషన్ ఫీజుగా 850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 100 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం..

అభ్యర్థులను 3 దశల్లో ఎంపిక చేశారు. మొదటి దశలో ప్రిలిమినరీ, రెండో దశలో మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. వీటిలో ఉతీర్ణత సాధించిన వారిని ఇంటర్వూలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వూల్లో క్వాలిఫై అయినవారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ https://www.newindia.co.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


Updated : 7 Aug 2023 7:21 PM IST
Tags:    
Next Story
Share it
Top