Budget 2024 -25 : మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
X
(Budget 2024 -25) సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతంలో మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును సమయం చేశారు. 2014లో మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి గత పదేండ్లలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని నిర్మల అన్నారు. ఎన్నో సవాళ్లు ఎదరువుతున్నా.. ప్రధాని నేతృత్వంలో వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్న సర్కారు.. అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అభివృద్ధి ఫలాలు ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ అందుతున్నాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశ సమగ్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నామని నిర్మల స్పష్టం చేశారు. గత పదేండ్లలో మోడీ తెచ్చిన సంస్కరణలు అభివృద్ధికి ఎంతో ఊతమిచ్చాయని మంత్రి అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ వచ్చిందని.. ఆత్మ నిర్భర్ భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని అన్నారు.
పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తివంతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించి.. దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఫ్రీ రేషన్ అందిస్తున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 25 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేయటంతో పాటు జన్ధన్ ఖాతాల ద్వారా పేదలకు 34లక్షల కోట్ల ఆర్థికసాయం అందజేసినట్లు చెప్పారు. 78లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలిచామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.