Home > జాతీయం > Forbes’ list 2023 : వరల్డ్ మోస్ట్ పవర్ పుల్ వుమెన్.. ఇండియా నుంచి నలుగురు

Forbes’ list 2023 : వరల్డ్ మోస్ట్ పవర్ పుల్ వుమెన్.. ఇండియా నుంచి నలుగురు

Forbes’ list 2023 : వరల్డ్ మోస్ట్ పవర్ పుల్ వుమెన్.. ఇండియా నుంచి నలుగురు
X

బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన వరల్డ్స్ మోస్ట్ పవర్ పుల్ వుమెన్ జాబితాలో మన దేశానికి చెందిన నలుగురు మహిళలకు స్థానం దక్కింది.వీరిలో నిర్మలా సీతారామన్, రోష్ని నాడార్ మల్హోత్రా, సోమా మొండల్, కిరణ్ మజుందార్ షా ఉన్నారు. వారు అద్దాల మేడల్లో నుంచి బయటకు రావడమే గాకుండ ప్రపంచ వేదిక మీద తమదైన ముద్ర వేసుకున్నారు. భారతదేశం యొక్క భిన్నత్వాన్ని, ప్రభావవంతమైన గొంతును వినిపించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ర్యాంకులను కేటాయించడానికి మనీ, మీడియా, ఇంఫాక్ట్, ఎదుటి వారిని ప్రభావితం చేసే కోణాలు అనే నాలుగు అంశాలను ప్రామాణికంగా పెట్టుకుంది ఫోర్బ్స్. ప్రపంచం వారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుండగా..వీరు మాత్రం ఏటికి ఎదురు ఈదడం, లీడర్ షిప్, అద్భుతాలకు బలమైన ప్రతీకలుగా నిలిచారు.వీరిలో ఒక్కొక్కరి గురించి ఇప్పుడు చూద్దాం.

నిర్మలా సీతారామన్:

64 సంవత్సరాల నిర్మలా సీతారామన్ బీజేపీలో సీనియర్ లీడర్. 2019 నుంచి కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. 2017 నుంచి 2019 వరకు రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన రెండో మహిళ. 2022 లో ఫోర్బ్స్ వరల్డ్స్ మోస్ట్ పవర్ పుల్ వుమెన్ జాబితాలో 36 వ ర్యాంక్ సాధించగా ఈసారి 32 వ ర్యాంక్ వచ్చింది.

రోష్ని నాడార్ మల్హోత్ర :

42 ఏళ్ల రోష్ని నాడార్ మల్హోత్రా కోటీశ్వరురాలు. దాత.HCL టెక్నాలజీస్ ఛైర్ పర్సన్. ఇండియాలోని లిస్టెడ్ ఐటీ కంపెనీకి నేతృత్వం వహిస్తూ చరిత్ర సృష్టిస్తోన్న మొదటి మహిళ.HCL ఫౌండర్ శివ్ నాడార్ ఏకైక కూతురు. దేశంలోనే సంపన్ను రాలైన మహిళగా గుర్తింపు ఉంది. వరల్డ్స్ మోస్ట్ పవర్ పుల్ వుమెన్ జాబితాలో 2019 లో 54 వ ర్యాంక్, 2020 లో 55 వ ర్యాంక్, 2023 లో 60 వ ర్యాంక్ పొందారు.

సోమా మొండల్

వయస్సు 60 ఏళ్లు. స్టీల్ ఆథార్టీ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్. 2021 నుంచి సెయిల్ లో పనిచేస్తూ చరిత్ర సృష్టిస్తు్న్నారు. భువనేశ్వర్ లో జన్మించిన ఈమె ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్. మెటల్ ఇండస్ట్రీలో 35 సంవత్సరాల అనుభవం ఉంది.

కిరణ్ మజుందార్ షా

ప్రముఖ పారిశ్రామికవేత్త. బెంగళూరులో బయోకాన్ లిమిటెడ్, బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు. బెంగళూరు ఐఐఎం మాజీ ఛైర్ పర్సన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆమె చేసిన సేవలకు ఎన్నో అవార్డులందుకున్నారు. 2019 లో వరల్డ్స్ మోస్ట్ పవర్ పుల్ వుమెన్ గా, 2020 లో ఈవై వరల్డ్ ఎంటర్ ప్రెనర్ గా గౌరవం పొందారు. ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో ఆమెకు 76 వ ర్యాంకు పొందింది.




Updated : 6 Dec 2023 2:13 PM IST
Tags:    
Next Story
Share it
Top