Home > జాతీయం > నిరాడంబరంగా నిర్మలా సీతారామన్ కూతురి పెళ్లి

నిరాడంబరంగా నిర్మలా సీతారామన్ కూతురి పెళ్లి

నిరాడంబరంగా నిర్మలా సీతారామన్ కూతురి పెళ్లి
X



కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం... ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా అత్యంత నిరాడంబరంగా జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల మధ్యే తన కుమార్తె వివాహం జరిపించారు నిర్మల. అధికారికంగా ఈ విషయాన్ని ఆమె ప్రకటించకున్నా.. వివాహానికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.





పరకాల ప్రభాకర్- నిర్మలా సీతారామన్ కుమార్తె వాంగ్మయి వివాహం.. ప్రతీక్ అనే వ్యక్తితో అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. బెంగళూరులోని నిర్మలా సీతారామన్ ఇంట్లోనే ఈ వివాహం జరిపించారు. తమిళ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వివాహం సాగింది. బుధవారం ఈ వేడుకను పూర్తి చేశారు. కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు ఎవరూ ఈ కార్యక్రమానికి రాలేదని తెలిసింది. నిర్మలా సీతారామన్ కుటుంబ సభ్యులు ఈ వివాహానికి సంబంధించిన వివరాలను అధికారికంగా బయటకు వెల్లడించలేదు. కానీ, వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.




పరకాల వాంగ్మయి.. ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. జర్నలిజంలోనూ ఆమెకు డిగ్రీ ఉంది. నార్త్​వెస్ట్ యూనివర్సిటీలోని మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి పట్టా సాధించారు. జర్నలిజంలో ఎంఎస్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న ఓ జాతీయ దినపత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తోన్నారు. ప్రత్యేకించి- ఆర్ట్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, సాహిత్యం మీద వార్తలను రాస్తుంటారు.




Updated : 9 Jun 2023 7:39 AM IST
Tags:    
Next Story
Share it
Top