Nitish Kumar : సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా
X
బిహార్లో అనుకున్నట్లే జరిగింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. బీజేపీ మద్ధతుతో సాయంత్రం మళ్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. నితీష్ ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని వీడి బీజేపీతో జతకడుతున్నారు. సీట్ల పంపకాల విషయంలో జేడీయూ-బీజేపీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా బీజేపీకి స్పీకర్ పదవితోపాటు రెండు డిప్యూటీ సీఎంలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు రేణు దేవి, సుశీల్ మోడీలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేస్తారని సమాచారం.
కాగా ఇండియా కూటమికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మమతా బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించగా.. ఇప్పుడు నితీష్ సైతం దూరమయ్యారు. ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిమాణాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. కమిటీ కన్వీనర్ లేదా ప్రధాని అభ్యర్థి స్థానాన్ని నితీష్ ఆశించారు. కానీ కాంగ్రెస్ ఆ రెండిటిని ఆయనకు దక్కకుండా చేసింది. మరికొన్ని రోజుల్లో రాహుల్ యాత్ర బిహార్లోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో నితీష్ కూటమి మార్చడం గమనార్హం.