Home > జాతీయం > విపక్షాలు వాకౌట్.. తొమ్మిదోసారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్

విపక్షాలు వాకౌట్.. తొమ్మిదోసారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్

విపక్షాలు వాకౌట్.. తొమ్మిదోసారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్
X

బీహర్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం (ఫిబ్రవరి 12) అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కున్నారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నిర్వహించిన ఈ బలపరీక్షలో నితీశ్ కుమార్ నెగ్గారు. ఆయనకు 129 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. దీంతో సభ నుంచి విపక్ష నేతుల వాకౌట్ చేశారు. ఇవాళ ఉదయం బిహార్ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ నేత అవథ్ బిహారీ చౌదరిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గిన తర్వాత నితీశ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా గత నెలలో విపక్షాలు ఇండియా కూటమిని వదిలిపెట్టి నితీశ్.. NDA-BJP కూటమిలో చేరిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే సపోర్టు తో 15 రోజుల కిందట బీహార్ రాష్ట్రానికి తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా.. బలపరీక్షకు ముందు రోజు వరకు బీహార్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో క్యాంపు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగా ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉన్నారు. బలపరీక్ష నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యేలు పాట్నా వెళ్లారు.

Updated : 12 Feb 2024 11:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top