Home > జాతీయం > శ్రీకృష్ణ జన్మభూమి దగ్గర కూల్చివేతలపై సుప్రీం కీలక ఆదేశం

శ్రీకృష్ణ జన్మభూమి దగ్గర కూల్చివేతలపై సుప్రీం కీలక ఆదేశం

శ్రీకృష్ణ జన్మభూమి దగ్గర కూల్చివేతలపై సుప్రీం కీలక ఆదేశం
X

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలోని అక్రమ కూల్చివేతలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు చేసింది. పది రోజుల వరకు అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టకూడదని రైల్వే శాఖను ఆదేశించింది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, సంజయ్ కుమార్, ఎస్‌విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై కేంద్ర సర్కార్‎కు రైల్వే శాఖలకు నోటీసులు పంపింది. అనంతరం కేసు విచారణను వచ్చే వారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

మథుర నంచి బృందావన్ వరకు 21 కిలో మీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మార్గంలో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన వందేభారత్ వంటి రైళ్ల రాకపోకలతో పాటు అధునాతన రైళ్లను నడిపేందకు వీలుగా ఈ స్ట్రెచ్‎ను నిర్మించాలని ఆలోచన చేశారు. దీంతో ఆగస్టు 9న శ్రీకృష్ణ జన్మభూమి దగ్గర ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు నయీ బస్తీలో 135 అక్రమ కట్టడాలను కూల్చివేశారు.

అయితే ఇదంతా తమపై జరుగుతున్న కుట్ర అని ఆరోపిస్తూ నయూ బస్తీ ప్రజలు కోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలు ఆపాలంటూ యూపీలోని కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే అక్కడ స్థానికంగా న్యాయవాదుల ఆందోళన జరుగుతుండటంతో ఈ పిటిషన్‌ విచారణకు రాలేదు. దీంతో బస్తీ వసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన సుప్రీం బస్తీ వాసులకు ఊరట కలిగించే వార్త అందించింది. 10 రోజుల వరకు అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టకూడదంటూ రైల్వే శాఖను ఆదేశించింది.





Updated : 16 Aug 2023 9:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top