Home > జాతీయం > RBI : ఆ ఛార్జీలు వసూలు చేయకండి.. బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం..

RBI : ఆ ఛార్జీలు వసూలు చేయకండి.. బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం..

RBI : ఆ ఛార్జీలు వసూలు చేయకండి.. బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం..
X

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్కు సంబంధించి కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేదన్న కారణంతో ఛార్జీలు విధించవద్దని స్పష్టం చేసింది. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదిలీ కోసం తెరిచిన అకౌంట్లు రెండేళ్లకు మించి వాడకపోయినా వాటిని ఉపయోగంలో లేని ఖాతాలుగా గుర్తించకూడదని సూచించింది. అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఆర్‌బీఐ ఈ సర్క్యులర్‌ జారీ చేసింది.

ఏప్రిల్‌ 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం.. వాడుకలో లేని ఖాతాలు నిరుపయోగంగా మారుతున్నాయన్న విషయాన్ని బ్యాంకులు ఎస్సెమ్మెస్‌, లెటర్‌, లేదా ఇ-మెయిల్‌ రూపంలో అకౌంట్ హోల్డర్కు తెలియజేయాలి. ఒకవేళ ఖాతాదారులు అందుబాటులో లేని పక్షంలో నామినీకి ఆ సమాచారాన్ని అందించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు పెరుగుతున్నాయని ఆర్‌బీఐ తాజా నివేదిక వెల్లడించింది. 2023 మార్చి నాటికి ఈ తరహా డిపాజిట్లు రూ.42,272 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది. 2022లో ఈ మొత్తం రూ.32,934 కోట్లుగా ఉండగా.. ఏడాదిలో 28 శాతం మేర పెరిగాయి. క్లెయిమ్‌ చేసుకోకుండా ఉన్న డిపాజిట్లను అకౌంట్ హోల్డర్ నామినీలు లేదా వారసులు గుర్తించేందుకు వీలుగా ఆర్బీఐ UDGAM పేరుతో ఇప్పటికే ఓ వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ 10 ఏండ్లకుపైగా అకౌంట్ డిపాజిట్‌ అన్‌క్లెయిమ్డ్‌గా ఉంటేనే దానిని ‘డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌’ ఫండ్‌ స్కీంకు ట్రాన్స్ఫర్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది.

Updated : 6 Jan 2024 4:07 PM IST
Tags:    
Next Story
Share it
Top