Bharat Jodo Nyay Yatra : మణిపూర్లో మళ్లీ అల్లర్లు.. రాహుల్ యాత్రకు నో పర్మిషన్..!
X
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రపై సస్పెన్స్ నెలకొంది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఆయన ఈ యాత్రను చేపడుతున్నారు. ఈ యాత్ర 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో రాహుల్ యాత్ర ప్రారంభంకావాల్సి ఉంది. అయితే మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో రాహుల్ యాత్రపై ఉత్కంఠ నెలకొంది.
ఇదే అంశంపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ కీలక వ్యాఖలు చేశారు. రాహుల్ యాత్రకు పర్మిషన్ అంశం పరిశీలనలో ఉందన్నారు. భద్రతా సంస్థల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మయన్మార్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు - ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రత బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ యాత్రకు అనుమతి లభిస్తుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది.
జనవరి 14న ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 30న ముగియనుంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా 66 రోజులపాటు సుమారు 6,713 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్‌సభ స్థానాలను కవర్ చేసేలా యాత్ర జరగనుంది. ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే యాత్ర.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల మీదుగా సాగుతుంది. భారత్ జోడో యాత్ర పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం బస్సుల్లో కొనసాగుతుంది. అయితే మధ్యమధ్యలో మాత్రం పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు. గతంలో రాహుల్ గాంధీ.. 2022లో రాహుల్ గాంధీ కన్యా కుమారి నుంచి కశ్మీర్ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టారు