పార్లమెంటులో మొదలైన అవిశ్వాస తీర్మాన చర్చ
Mic Tv Desk | 8 Aug 2023 12:37 PM IST
X
X
కేంద్ర ప్రభుత్వం మీద విపక్ష కూటమి లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీ చర్చ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటూ ఈ చర్చ జరగనుంది. చివరి రోజు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్నాయి. రెండు జాతుల వారు కొట్టుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఎన్నెన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఇందులో ఇద్దరు ఆడవాళ్ళను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. దీని మీద ప్రకటన చేసేందుకు ప్రధాని పార్లమెంటుకు రావాలని కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఉభయ సభలు కంటిన్యూగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి మాట్లాడతారని చెప్పినా విపక్షాలు ఒప్పుకోలేదు. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
Updated : 8 Aug 2023 12:37 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire