ఆగస్టు నుంచి మూడు రోజుల పాటూ అవిశ్వాస తీర్మానం మీద చర్చ
X
మోడీ ప్రభుత్వం మీద పెట్టిన అవిశ్వాసం మీద పార్లమెంటులో ఈరోజు చర్చలు జరిగాయి. దీని గురించి ఎప్పుడు చర్చించాలో తేదీలు ఖరారు అయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటూ చర్చలు జరుగుతాయి. ఆఖరి రోజు ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ఈమేరకు లోక్ సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మణిపూర్ లో ఇద్దరు మహిళలకు జరిగిన అవమానం దేశాన్ని కుదిపేసింది. దీని మీద పార్లమెంటు ఇరు సభలు కూడా రోజూ దద్ధరిల్లుతున్నాయి. ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు రోజు పట్టుబడ్తున్నాయి. హోంమంత్రి అమిత్ షా మాట్లాడతారని ప్రభుత్వం చెప్పింది కానీ విపక్షాలు వినలేదు. స్వయంగా ప్రధానే మాట్లాడాలని పట్టుబట్టాయి. అందుకే అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించాయి.
అయితే బీజెపీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెద్దగా పని చేయదు. ఎందుకంటే ప్రభుత్వం తరుఫున 144 మంది సభ్యులు ఉన్నారు. అయినప్పటికీ మణిపూర్ అంశంమీద ప్రధాని మోడీనే స్పందించాలన్న లక్ష్యంతో విపక్షాలు దీన్ని ప్రవేశపెట్టాయి. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ వాదనను ఒప్పుకోవడం లేదు. బిల్లు ప్రవేశపెట్టడానికి ముందే తీర్మానాన్ని చేపట్టాలని రూలేమీ లేదని...పది రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చని అన్నారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్.