Rajasthan CM Race: సీఎం రేసులో నేను లేను.. కేంద్ర మంత్రి క్లారిటీ..
X
రాజస్థాన్లో ఎలక్షన్ షెడ్యూల్ విడుదలవడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార కాంగ్రెస్కు చెక్ పెట్టాలని బీజేపీ.. రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నాయి. బీజేపీ ఇప్పటివరకు 41 మంది అభ్యర్థుల్ని ప్రకటించగా.. అందులో ఏడుగురు ఎంపీలు ఉండడ గమనార్హం. అయితే కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను బీజేపీ ఎన్నికల బరిలోకి దింపుతుందని.. ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
సీఎం అశోక్ గెహ్లాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న సర్దార్పుర నుంచి షెకావత్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో షెకావత్ స్పందించారు. తాను సీఎం రేసులో లేనని స్పష్టం చేశారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పాటిస్తానని చెప్పారు. పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడమే తన పని అని అన్నారు. ఇంతకన్నా తనకు ఎలాంటి ఆశలు, కోరికలు లేవని.. సీఎంగా ఎవరు ఉండాలనేది పార్టీ శాసనసభాపక్షం నిర్ణయిస్తుందని చెప్పారు.