Home > జాతీయం > జవహర్ నవోదయ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

జవహర్ నవోదయ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

జవహర్ నవోదయ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
X

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో విద్యా సంవత్సరానికి (2024-25) ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ రిలీజైంది. దేశంలోని 649 జేఎన్‌వీల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్‌ 4న పర్వత ప్రాంత రాష్ట్రాల్లో పరీక్ష జరగనుండగా, తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా చోట్ల 2024 జనవరి 20 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగస్టు 10 కల్లా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అర్హత

విదార్థి జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న జిల్లావాసి అయి ఉండాలి.

2023-24 విద్యా సంవత్సరంలో ఆ జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో ఐదో తరగతి చదువుతుండాలి.

జేఎన్వీల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులను గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.

దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2012 నుంచి జులై 31, 2014 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.

జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

JNV అధికారిక వెబ్‌సైట్‌ https://navodaya.gov.in/nvs/en/Home1 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను రాసి స్కూల్ హెడ్ మాస్టర్ సంతకంతో సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయాలి. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌ వివరాలు/ నివాస ధ్రువపత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 2024 మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఫలితాలు వెలువడనున్నాయి.

Updated : 19 Jun 2023 9:17 PM IST
Tags:    
Next Story
Share it
Top