Home > జాతీయం > ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పెండ్లి బస్సు.. 12 మంది మృతి

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పెండ్లి బస్సు.. 12 మంది మృతి

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పెండ్లి బస్సు.. 12 మంది మృతి
X

ఒడిశాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సును (RTC Bus).. పెండ్లి బృందంతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ (MKCG) దవాఖానకు తరలించారు. రెండు బస్సుల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.




మృతుల్లో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నవారే ఉన్నారని పోలీసులు తెలిపారు. రాయ్‌గఢ్‌ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. పెండ్లి బస్సు ఢికొట్టిందిని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ (CM Naveen Patnaik) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రమాదం జరిగిన వెంటనే రూ.30,000 పరిహారం ప్రకటించారు.





కొన్ని రోజుల క్రితమే ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బహానగా రైల్వే స్టేషన్​లో లూప్‌ లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్‌ రైలును కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పి పక్క ట్రాక్‌పై పడ్డాయి. ఆ ట్రాక్ పై వస్తున్న బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ చివరి బోగీలను ఢీకొట్టిన ఘటనలో 288 మంది మరణించారు. 1,200 మందికి పైగా గాయాలపాలయ్యారు.

Updated : 26 Jun 2023 9:10 AM IST
Tags:    
Next Story
Share it
Top