Home > జాతీయం > మృత్యుఘోష.. లూప్‌లైన్‌లోకి సిగ్నల్ ఇవ్వడం వల్లే..

మృత్యుఘోష.. లూప్‌లైన్‌లోకి సిగ్నల్ ఇవ్వడం వల్లే..

మృత్యుఘోష.. లూప్‌లైన్‌లోకి సిగ్నల్ ఇవ్వడం వల్లే..
X

233 మందిని బలిగొన్న ఒడిశా రైలు ప్రమాదంపై దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నా ఎందుకీ ఘోరం జరిగిందని నివ్వెరపోతోంది. దేశ ప్రతిష్టకు చిహ్నమైన భారతీయ రైల్వే వ్యవస్థ సత్తాపై నీలినీడలు కమ్మించిన ఈ ఘోరం ఎలా జరిగిందో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

శుక్రవారం సాయంత్రం 6.55 ప్రాంతంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ స్టాప్ లేని బహనాగ రైల్వేస్టేషన్‌ మీదుగా వచ్చింది. లూప్ లైన్‌లోకి వచ్చిన ఆ రైలు తర్వాత అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. బోగీలు పక్కనున్న ట్రాక్‌పై పడిపోయాయి. అదే ట్రాక్‌పై వస్తున్న యశ్వంత్‌పూర్‌–హౌరా ఎక్స్‌ప్రెస్‌.. పడిపోయిన కోరమాండల్ బోగీలను ఢీకొట్టింది. ఆ రైలు బోగీలు నాలుగు పట్టాలు తప్పాయి. అయితే కోరమాండల్ రైలు ఎలా పట్టాలు తప్పిందన్నదానిపై పొంతనలేని సమాధానాలు వస్తున్నాయి. అది వచ్చిన ట్రాకుపై గూడ్సు రైలు ఉంది. అది లూప్‌లైన్‌. స్టేషన్‌లో స్టాప్‌ లేనప్పుడు రైలుకు మెయిన్‌ లైన్‌లో ట్రాక్‌ సిగ్నల్‌ ఇస్తుంటారు. మరి కోరమాండల్‌కు లూప్‌లైన్‌లో సిగ్నల్‌ ఎందుకిచ్చారని తెలియడం లేదు. అది 128 కిలోమీటర్ల వేగంతో లూప్ లైన్లోకి దూసుకొచ్చి అక్కడున్నర గూడ్సును బలంగా ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. అయితే అధికారులు దీనిపై స్పందించడం లేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ తెలిపింది.

తీవ్రత

కోరమాండల్ రైలు సాయంత్రం ప్రమాద సమయంలో, 6 గంటల 55 నిమిషాల 28 సెకన్లకు.. 128 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ప్రమాదం జరిగాక, అంటే 6 గంటల 55 నిమిషాల 51 సెకన్లకు వేగం సున్నాకు పడిపోయింది. దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలుకు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే వేగం సున్నాకు పడిపోవాలంటే 60 నుంచి 80 సెకన్లు పడుతుంది. కానీ కోరమాండల్ వేగం ప్రమాదం తర్వాత 23 సెకన్లలోనే పడిపోయింది.


Updated : 3 Jun 2023 9:04 AM IST
Tags:    
Next Story
Share it
Top