ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం..132మందికి గాయాలు
Mic Tv Desk | 2 Jun 2023 9:20 PM IST
X
X
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలసోర్ జిల్లా బహనాగ్ రైల్వేస్టేషన్‌లో ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దీంతో ఎక్స్ప్రెస్లోని 7బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 132 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఎక్స్ప్రెస్ కలకత్తాలోని హౌరా నుంచి చెన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Updated : 2 Jun 2023 9:20 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire