ఒడిశా రైలు ప్రమాదం ఇలా జరిగిందా.. వైరల్ అవుతోన్న వీడియో
X
ఒడిశా బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. దేశ చరిత్రలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఒకటిగా.. ఈ ప్రమాదం నిలిచిపోయింది. ప్రమాద స్థలంలో చెల్లాచెదరుగా పడిఉన్న భోగీలు, మృతదేహాల విజువల్స్ ను చాలామంది చూసుంటారు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ విడియో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కొన్ని సెకండ్ల ముందు వీడియో అంటూ.. అంతా షేర్ చేస్తున్నారు. అది నిజమా.. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న వ్యక్తి తీసిన వీడియోనా..! అనేది క్లారిటీ రాలేదు. కాకపోతే.. వీడియోలో ప్రమాద జరిగినప్పుడు ప్రయాణికులు కేకలు మాత్రం వినిపించాయి.
ఈ వీడియోను ఒడిశా న్యూస్ ఛానెల్ కూడా టెలికాస్ట్ చేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి రైలులోపల శుభ్రం చేస్తుంటాడు. ప్రయాణికులు నిద్రపోతుంటారు. ఇదంతా మరో ప్రయాణికుడు వీడియో తీస్తుంటాడు. అంతలో ప్రమాదం జరిగి.. హాహాకారాలతో వీడియో ఆగిపోతుంది. అయితే, ఈ విడియో నిజమా కాదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో 288 మంది చనిపోయారు. ఇంకా 82 మృతదేహాలు ఎవరివో గుర్తుపట్టాల్సి ఉంది. వీలైనంత త్వరగా వాటిని బంధువులకు అప్పగించే పనిలో పడ్డారు అధికారులు.
विचलित करने वाला
— Dilip Rao G Shetty ✪ (@DilipRaoG) June 8, 2023
Disturbing Video ALERT!!!#ओडिशा के #बालासोर में #ट्रेन_हादसे का विचलित करने वाला #वीडियो सामने आया है जो उस वक़्त इस घटना को एसी डिब्बे के अंदर कोई कैद कर रहा था🥲
#news #TrainAccident #Balasore #OdishaTrainAccident #BalasoreTrainAccident #OdishaTrainTragedy pic.twitter.com/90WiAm5nAV