Home > జాతీయం > 14 ఏళ్ల క్రితం..ఇదే శుక్రవారం కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కి ప్రమాదం....

14 ఏళ్ల క్రితం..ఇదే శుక్రవారం కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కి ప్రమాదం....

14 ఏళ్ల క్రితం..ఇదే శుక్రవారం కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కి ప్రమాదం....
X

ఒడిశాలోని బాలేశ్వర్‌‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంతో కళ్లు మూచి తెరిచేలోపు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేయికి పైగా గాయాలతో చికిత్స పొందతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో...మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోపక్క సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోగీలను వెలికితీసే క్రమంలో మృతదేహాలను బయపడుతుండడంతో అక్కడి దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి.

ఇప్పటివరకు దేశంలో జరిగిన అతి రైలు ప్రమాదాలలో నిన్న రాత్రి జరిగిన కోరమండల్ ప్రమాదం ఒకటి. గతంలో కూడా కోరమండల్ రైలు ప్రమాదానికి గురైంది. 2009 సంవత్సరంలో కూడా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌‌కి ప్రమాదం జరిగింది . ఆ రోజు కూడా శుక్రవారం..ప్రమాదం 7.30 నుంచి 7.40 మధ్య జరగడం గమనార్హం. 14 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 13, 2009న ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ అత్యంత వేగంతో జైపుర్ రోడ్ రైల్వే స్టేషన్‌ దాటుతోంది. ట్రాక్‌ మార్చుకుంటున్న సమయంలో అదుపు తప్పడంతో రైలు పట్టాలు తప్పి బోగీలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. నిన్నటి ప్రమాదంతో మరోసారి గతంలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదాన్ని గుర్తుకుతెచ్చుకుంటున్నారు.

Updated : 3 Jun 2023 10:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top