రేపు భారత్ బంద్ కదా.. స్కూళ్లు, బ్యాంకులు తెరిచుంటాయా?
X
గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనుదిరిగేది లేదని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ.. సంయుక్త కిసాన్ మోర్చా శుక్రవారం (ఫిబ్రవరి 16) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ బంద్ కు మద్దతు తెలపాలని రైతు సంఘాలను కోరింది. రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామీణ భారత్ బంద్ పేరుతో దేశవ్యాప్త సమ్మె మొదలవనుంది. దీంతో పాటు పంజాబ్ లో రాష్ట్ర, జాతీయ రహదారులు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసేయనున్నారు. కాగా భారత్ బంద్ కారణంగా రేపు స్కూళ్లు, బ్యాంకులు తెరిచి ఉంటాయా? మూతబడతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
భారత్ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు మూతబడనున్నాయి. వీటితో పాటు మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులు, గ్రామీణ పరిశ్రమలు, సేవా రంగ సంస్థలు కూడా క్లోస్ చేయనున్నారు. అయితే.. అంబులెన్సులు, స్కూళ్లు, విద్యాసంస్థలు, ఫార్మసీలు, ఎమర్జెన్సీ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. బ్యాంకులు కూడా తెరిచే ఉంటాయి.