Home > జాతీయం > Odisha train accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ

Odisha train accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ

Odisha train accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ
X

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంతో దేశం ఉలిక్కిపడింది. ఈ యాక్సిడెంట్ లో దాదాపు 288 మంది చనిపోయారు. 11వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, వార్తల్లో వచ్చినట్లు 288 మంది చనిపోలేదని.. 275 మృత్యువాత పడినట్లు ఒడిశా ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ‘మృత దేహాల లెక్కింపులో పొరపాట్లు జరిగాయి. కొన్ని బాడీలను రెండు సార్లు లెక్కించారు. ఘటనా స్థలంలో.. తిరిగి హాస్పిటల్ దగ్గర లెక్కించారు. దాంతో మృతుల సంఖ్యలో తేడా వచ్చింది. చివరిసారి లెక్కించినప్పుడు స్పష్టత వచ్చింద’ని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు.

కాగా, మొత్తం 275 మృతదేహాల్లో ఇప్పటివరకు 78 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబానికి అప్పగించారు అధికారులు. మరో 10 మృతదేహాలను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారు. మిగాతా 187 బాడీల్లో 170 బాడీలను భువనేశ్వర్ కు.. 17 బాడీలను బాలేశ్వర్ జిల్లా కేంద్రానికి తరలించారు. మొత్తం 85 అంబులెన్స్ ల ద్వారా మృతులను భువనేశ్వర్ లోని వివిధ మార్చురీలకు తరలించారు. చనిపోయిన, గాయపడ్డ వాళ్ల ఫొటోలను https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org. వెబ్‌సైట్లలో ఉంచామని, ఎవరైనా గుర్తిస్తే.. 18003450061 లేదా 1929 నెంబర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు కోరారు.

Updated : 4 Jun 2023 12:39 PM GMT
Tags:    
Next Story
Share it
Top