Home > జాతీయం > OLA Scooty : ఓలా ఆఫర్లు..ఈ-స్కూటర్ పై భారీగా తగ్గింపు

OLA Scooty : ఓలా ఆఫర్లు..ఈ-స్కూటర్ పై భారీగా తగ్గింపు

OLA Scooty : ఓలా ఆఫర్లు..ఈ-స్కూటర్ పై భారీగా తగ్గింపు
X

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ విద్యుత్ స్కూటర్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఫిబ్రవరి నెలకు గానూ ఎంపిక చేసిన స్కూటర్లపై రూ.25 వేల వరుకు తగ్గింపు ఇస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఎస్1ప్రో, ఎస్ ఎయిర్, ఎస్1 ఎక్స్+ మోడళ్లకు తగ్గింపు వర్తింస్తుదన్నారు.సవరించిన ధరలు ఫిబ్రవరి 16 నుంచే అందుబాటులోకి వస్తాయని భవీశ్ తెలిపారు. ఓలా S1 ప్రో ధర రూ.1,47,499 కాగా, ఈ తగ్గింపుతో రూ.1,29,999కే లభిస్తుంది. S1 ఎయిర్ మోడల్ ధర రూ.1,19,999 కాగా ఆఫర్‌తో రూ.1,04,999కు కొనుగోలు చేయవచ్చు. S1 X+(3kWh) మోడల్ ధర రూ.1,09,999, కానీ ఇప్పుడు రూ.84,999కే అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా తమ ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ ధరలో లభించేలా చేయడానికి కట్టుబడి ఉన్నాము. దీనికోసం అన్ని అడ్డంకులను అధిగమిస్తున్నామని కంపెనీ తెలిపింది.

ఓలా అంతకుముందు జనవరి నెలలో కూడా ఇదే స్ట్రాటజీ అమలు చేసింది. అప్పుడు ఓలా ఎలక్ట్రిక్ ఫ్లాట్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తింది. S1 X+ మోడల్‌పై అప్పుడు రూ. 20 వేల తక్షణ తగ్గింపు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా ఫ్రీ ఎక్స్‌టెండెడ్ వారెంటీ, ఎక్స్చేంజ్ బోనస్ వంటి ఆఫర్లతో పాటు.. ఓలా ఎస్‌1 ప్రో, ఎస్‌1 ఎయిర్ మోడళ్లపై క్రెడిట్ కార్డు డిస్కౌంట్లు అందించింది.వీటితో పాటు ఇంకెన్నో బెనిఫిట్స్ కూడా కొనుగోలు దారులు పొందుతున్నారు. జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్ ఫీజులు విధిస్తోంది. ఆకర్షణీయ స్థాయిలో 7.99 శాతం మాత్రమే వడ్డీ వేస్తోంది. ఈ క్రమంలోనే ఓలా ఎలక్ట్రిక్ రికార్డు స్థాయిలో సేల్స్ నిర్వహిస్తుండటం విశేషం.

Updated : 16 Feb 2024 6:26 PM IST
Tags:    
Next Story
Share it
Top