LPG Price Hike : బడ్జెట్ రోజున ఝలక్.. భారీగా గ్యాస్ ధర పెంపు.. కొత్త రేట్లు ఇవే
X
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వేళ.. దేశంలో గ్యాస్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం (OMCs) తీసుకున్నాయి. నెల ప్రారంభ తేదీ కావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.14 చొప్పున పెంచాయి. అయితే పెరిగిన గ్యాస్ ధరలు 19 కేజీలుండే కమర్షియల్ సిలిండర్ కు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. గృహ అవసరాల కోసం వినియోగించే LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. 2023 ఆగస్ట్ నాటి నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం.. హైదారాబాద్ లో రూ. 966, వరంగల్ లో రూ. 974, విశాఖపట్నంలో రూ. 912, విజయవాడలో రూ. 927, గుంటూరులో రూ. 944 ఉన్నాయి.
పెరిగిన గ్యాస్ రేట్లు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి:
➤ దేశ రాజధాని ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.14 పెరిగి రూ.1769.50కు చేరింది.
➤ కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.18 పెరిగి రూ.1887కు చేరుకుంది.
➤ ముంబైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.15 పెరిగి రూ.1723.50కు చేరుకుంది.
➤ చెన్నైలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.12.50 పెరిగి రూ.1937కు చేరింది.